News April 9, 2025

TG మాజీ గవర్నర్ తమిళిసైకు పితృవియోగం

image

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి, తమిళనాడు కాంగ్రెస్‌లో సీనియర్ లీడరైన కుమారి అనంతన్(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో ఈరోజు పరిస్థితి విషమించి మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Similar News

News November 16, 2025

APPLY NOW: MECLలో ఉద్యోగాలు

image

మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (<>MECL<<>>) 10 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc, ఎంటెక్, MSc (జియోఫిజిక్స్/అప్లైడ్ జియోఫిజిక్స్/జియోఫిజికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. UPSC-CGSE 2024 స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mecl.co.in/

News November 16, 2025

వేదాలను ఎందుకు అధ్యయనం చేయాలి?

image

వేదాలు అమూల్య రత్నాలు గల మహాసముద్రాల కంటే లోతైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. అందుకే వాటిని అధ్యయనం చేయాలి. వీటిలో విశ్వ రహస్యాలు, సైంటిఫిక్ విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఇహ, పరలోకాల్లో శాశ్వత ఆనందాన్ని, సుఖాలను అందించే మార్గాన్ని చూపుతాయి. సామాన్య మానవుడిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. మన జీవితాన్ని ఉన్నతంగా, సంతోషంగా మార్చుకోవడానికి, సృష్టి రహస్యాలు తెలుసుకోవడానికి వేదాలు చదవాలి. <<-se>>#VedikVibes<<>>

News November 16, 2025

KG చికెన్ ధర ఎంతంటే?

image

గత వారంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. హైదరాబాద్‌లో స్కిన్ లెస్ కేజీ రూ.210-230 పలుకుతోంది. కామారెడ్డిలో రూ.230-240గా ఉంది. అటు ఏపీలోని విజయవాడలో రూ.250, గుంటూరులో రూ.260, ప.గో. జిల్లా భీమవరంలో రూ.230-250, ఏలూరులో రూ.230కి విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో మటన్ కేజీ రూ.800కు పైగానే ఉంది. మరి మీ ఏరియాలో చికెన్, మటన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.