News April 9, 2025
జాబ్ మేళాకు పక్కడ్బందీ ఏర్పాట్లు: వరంగల్ కలెక్టర్

ఈనెల 11న వరంగల్ నగరంలోని సికే నాయుడు కన్వెన్షన్ హల్‌లో జరిగే జాబ్ మేళాకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈనెల 11న ఉదయం 9:30 గంటల నుంచి జరిగే మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై నిర్వాహకులు, జిల్లా అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించి సమర్ధవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు.
Similar News
News November 5, 2025
పాలమూరు: టీచింగ్ ప్రాక్టికల్స్ షెడ్యూల్ విడుదల

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed.) 2024-26 బ్యాచ్‌కు చెందిన మొదటి సంవత్సర ఫైనల్ లెసన్ టీచింగ్ ప్రాక్టికల్స్ (FLTP) రెండు దశల్లో నిర్వహించనున్నాయి. మొదటి దశ ఈనెల 10 నుంచి 14 వరకు, రెండో దశ ఈనెల 17 నుంచి 21 వరకు జరుగుతుందని విద్యార్థుల హాల్ టికెట్లు వెబ్‌సైట్ bse.telangana.gov.in ద్వారా ఈనెల 4 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
News November 5, 2025
నవాబుపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్ నగర్ జిల్లాల్లో వివిధ ప్రాంతాలలో గడిచిన 24 గంటలు వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది అత్యధికంగా నవాబుపేటలో 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. మిడ్జిల్ మండలం దోనూరు 21.8, జడ్చర్ల 8.5, మహబూబ్‌నగర్ రూరల్ 4.8, అడ్డాకుల 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
News November 5, 2025
నేడు గిరి ప్రదక్షిణ చేస్తే..?

అరుణాచలంలోని అన్నామలై కొండను శివలింగంగా భావించి చేసే ప్రదక్షిణనే ‘గిరి ప్రదక్షిణ’ అంటారు. అయితే ఈ ప్రదక్షిణను కార్తీక పౌర్ణమి రోజున చేయడం వల్ల మరింత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. 14KM ఉండే ఈ గిరి చుట్టూ చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరి, ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పున్నమి వెలుగులో ప్రదక్షిణ చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు.


