News April 9, 2025

వరంగల్ కలెక్టరేట్‌లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ సమావేశం

image

జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో(TG-iPASS/ DIPC) జిల్లా ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. టీజీ ఐపాస్ ఆన్‌లైన్ వెబ్సైట్ ద్వారా వివిధ శాఖల నుంచి వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిశీలించి మంజూరుకు అనుమతులు ఇచ్చే విధంగా వివిధ శాఖలతో సమన్వయం చేయాల్సిందిగా ఆదేశించారు.

Similar News

News January 11, 2026

ఠాక్రేలు తలచుకుంటే 10 నిమిషాల్లో ముంబై బంద్: రౌత్

image

ముంబై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల వేళ శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. ఠాక్రే ఫ్యామిలీ పవర్ ఇప్పటికీ తగ్గలేదని, తలచుకుంటే కేవలం 10 నిమిషాల్లో ముంబైని స్తంభింపజేయగలరని వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల తర్వాత BMC ఎన్నికల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలవడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఎన్నికల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఠాక్రేల క్రేజ్ తగ్గలేదంటూ ధీమా వ్యక్తం చేశారు.

News January 11, 2026

రేపు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం: కలెక్టర్

image

PGRS కార్యక్రమం సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా ఆర్డీవో కార్యాలయాలు, ఎంపీడీవో, తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, నిర్ణీత సమయంలో పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.

News January 11, 2026

ఇంటి చిట్కాలు మీ కోసం

image

* స్టెయిన్ లెస్ స్టీల్ సింకులు మెరుపు తగ్గకుండా ఉండాలంటే, వెనిగర్‌లో ముంచిన స్పాంజ్‌తో శుభ్రం చెయ్యాలి.
* ఓవెన్‌లో వెనీలా ఎసెన్స్ ఉంచి కొద్దిసేపు వేడి చేస్తే లోపలి దుర్వాసనలు దూరమవుతాయి.
* నూనె డబ్బాల మీద బంగాళా దుంప ముక్కలతో రుద్దితే తుప్పు మరకలు రాకుండా ఉంటాయి.
* నీటిలో కాస్త వెనిగర్, లిక్విడ్ డిష్‌వాష్ కలిపి, దానిలో ముంచిన వస్త్రంతో కిటికీలను తుడిస్తే పేరుకున్న దుమ్ముపోతుంది.