News April 9, 2025
BHPL: వర్షంతో కూలిన షెడ్డు.. నిరాశ్రయురాలిగా వృద్ధురాలు

భూపాలపల్లి మండలం కొత్తపల్లి సమ్మె గ్రామంలో సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షంతో కురిసిన విషయం తెలిసిందే. దీంతో వృద్ధురాలు సరోజనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని, ఇల్లు నిర్మించుకునే స్థోమత లేదని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Similar News
News October 23, 2025
కృష్ణా: DPRలో ఫ్లై ఓవర్ల ప్రస్తావన కరువు..!

VJA- MTM జాతీయ రహదారి విస్తరణకు సిద్దమవుతున్న DPRలో ఫ్లై ఓవర్ల ప్రస్తావన కానరావడంలేదు. ఈడుపుగల్లు, గంగూరు, పెనమలూరు, పోరంకి, తాడిగడప వద్ద ఫ్లై ఓవర్లు నిర్మిస్తే ట్రాఫిక్ రద్దీ నియంత్రణతో పాటు అక్కడ నివసించేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. DPR సిద్ధమయ్యాక ఫ్లై ఓవర్ల ప్రతిపాదనలు ముందుకెళ్లవని.. ఇక్కడి ఎంపీలు ముందుగా స్పందిస్తేనే ఫ్లై ఓవర్లతో కూడిన సమగ్ర DPR సిద్ధమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
News October 23, 2025
వనపర్తి జిల్లాలో 24 గంటల్లో నమోదైన వర్షపాతం

వనపర్తి జిల్లాలో 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో గడచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా అత్యధికంగా విల్లియంకొండలో 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఏదుల 7.5 మి.మీ, ఆత్మకూర్ 7.3 మి.మీ, రేమెద్దుల 5.5 మి.మీ, జానంపేట 4.5 మి.మీ, వీపనగండ్ల 2.5 మి.మీ, వనపర్తి, వెలుగొండ, కేతపల్లి 1.8 మి.మీ, పెబ్బేరు 1.0 మి.మీ, రేవల్లి 0.8 మి.మీ, రేవల్లి 0.5 మి.మీ, మిగతా 8 కేంద్రాలలో 0.0 మి.మీ వర్షపాతం నమోదయింది.
News October 23, 2025
కృష్ణా: పొలాలపై వరుణుడి ఎఫెక్ట్

జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. కంకి దశకు చేరిన వరి పంటలు పాడైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో వర్షాలు విరుచుకుపడడంతో నష్టపోతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. వర్షం మరికొన్ని రోజులు కొనసాగితే పంటలు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.