News March 27, 2024
నేడు ‘మగధీర’ రీరిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ మూవీ నేడు రీరిలీజ్ కానుంది. చెర్రీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా స్క్రీనింగ్ అయ్యే థియేటర్లలో ‘గేమ్ ఛేంజర్’ మూవీలోని ‘జరగండి’ పాట కూడా ప్రదర్శించనున్నారు. ఇది మెగా ఫ్యాన్స్‌కు డబుల్ బ్లాస్ట్ అని సంబరపడిపోతున్నారు.
Similar News
News March 27, 2026
ప్రతి చిన్న విషయానికి సారీ అక్కర్లేదు: సమంత

ఒకే పరిస్థితి ఎదురైనప్పుడు మగాళ్లతో పోలిస్తే మహిళలు 10రెట్లు ఎక్కువగా సారీ చెబుతున్నారని నటి సమంత అన్నారు. ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదని, తమను తాము తగ్గించుకోవడం ఆపాలని కోరారు. ఇక మూవీ ఇండస్ట్రీలో లేడీ యాక్టర్లు గుర్తింపునకు రెట్టింపు కష్టపడాల్సి వస్తోందని చెప్పారు. లేడీ ఓరియంటెడ్ మూవీలను రిస్క్‌లాగా చూడటం ఆపాలని ముంబైలో జరిగిన ఉమెన్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంలో తెలిపారు.
News March 27, 2026
బ్లడ్‌బాత్.. ₹9 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ 487 పాయింట్లు కోల్పోయి 22,819 వద్ద, సెన్సెక్స్ 1,690 పాయింట్ల నష్టంతో 73,583 వద్ద ముగిశాయి. దీంతో ఒక్కరోజే ₹9 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. టాటా మోటార్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోగా, ONGC, TCS, విప్రో, ఎయిర్‌టెల్, కోల్ ఇండియా షేర్లు లాభపడ్డాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ఠానికి(94.82) పడిపోయింది.