News April 9, 2025

మహిళలకు కర్ణాటక మంత్రి క్షమాపణలు

image

బెంగళూరులో ఇద్దరు మహిళల పట్ల ఓ దుండగుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర ‘నగరాల్లో మహిళలపై లైంగిక దాడులు సాధారణమే’ అన్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది వాటిని వక్రీకరించారు. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన మహిళలు నన్ను క్షమించండి. స్త్రీల రక్షణకే నేనెప్పుడూ అధిక ప్రాధాన్యాన్ని ఇస్తాను’ అని వివరణ ఇచ్చారు.

Similar News

News April 19, 2025

‘పెద్ది’లో కాజల్ స్పెషల్ సాంగ్?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ మూవీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కాజల్‌ను మూవీ యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు టాక్.

News April 19, 2025

KOHLI: 18 ఏళ్ల తర్వాత అదే సీన్ రిపీట్

image

నిన్న (ఏప్రిల్ 18) RCB vs PBKS మ్యాచులో ఓ యాదృచ్ఛిక సంఘటన చోటు చేసుకుంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ విషయంలో 18 ఏళ్ల తర్వాత ఓ ఫీట్ రిపీటైంది. 2008 ఏప్రిల్ 18న కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో, నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచులోనూ విరాట్ ఒక్క పరుగే చేశారు. ఈ రెండు మ్యాచులూ చిన్నస్వామి స్టేడియం వేదికగానే జరగడం గమనార్హం. కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18 కావడం గమనార్హం.

News April 19, 2025

విచారణకు హాజరైన మిథున్ రెడ్డి

image

AP: మద్యం కేసులో విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. నిన్న విజయసాయి రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది.

error: Content is protected !!