News April 9, 2025

ADB: ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

image

నిర్మల్ పట్టణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు అతని 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.

Similar News

News April 19, 2025

కూకట్‌పల్లి: 6 రోజుల్లో పెళ్లి అంతలోనే.. SUICIDE

image

అనారోగ్య సమస్యలతో కూకట్‌పల్లి హబీబ్‌నగర్‌లో <<16143590>>చోటూ<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. మహమ్మద్ చోటూ 4 నెలలుగా వెన్నునొప్పి, కుడి చేతి నొప్పితో బాధపడుతూ వైద్యం తీసుకుంటున్నాడు. అది ఎంతకీ తగ్గకపోవడంతో ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి 25న పెళ్లి జరగాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 19, 2025

KOHLI: 18 ఏళ్ల తర్వాత అదే సీన్ రిపీట్

image

నిన్న (ఏప్రిల్ 18) RCB vs PBKS మ్యాచులో ఓ యాదృచ్ఛిక సంఘటన చోటు చేసుకుంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ విషయంలో 18 ఏళ్ల తర్వాత ఓ ఫీట్ రిపీటైంది. 2008 ఏప్రిల్ 18న కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో, నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచులోనూ విరాట్ ఒక్క పరుగే చేశారు. ఈ రెండు మ్యాచులూ చిన్నస్వామి స్టేడియం వేదికగానే జరగడం గమనార్హం. కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18 కావడం గమనార్హం.

News April 19, 2025

విశాఖ మేయర్ పీఠం.. పార్టీల బలాబలాలు

image

మరికొద్ది గంటల్లో విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడనుంది. 2021లో జరిగిన GVMC ఎన్నికల్లో YCP 58 స్థానాలు నెగ్గి మేయర్ పీఠం కైవశం చేసుకుంది. TDP-30, JSP-3, CPM, CPI ఒక్కో స్థానం గెలిచాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమీకరణాలు మారాయి. దీంతో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కూటమికి సుమారు 64 మంది, YCPకి 30 మంది కార్పొరేటర్‌లున్నారు. ఈ ఓటింగ్‌కు కమ్యూనిస్ట్ పార్టీలు దూరంగా ఉంటున్నాయి.

error: Content is protected !!