News April 9, 2025

11న ఒంటిమిట్టకు చంద్రబాబు దంపతులు

image

AP: సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా ఈ నెల 11న వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో పర్యటించనున్నారు. ఆ రోజున సాయంత్రం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఒంటిమిట్టకు వెళతారు. కోదండరామ స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

Similar News

News April 19, 2025

KOHLI: 18 ఏళ్ల తర్వాత అదే సీన్ రిపీట్

image

నిన్న (ఏప్రిల్ 18) RCB vs PBKS మ్యాచులో ఓ యాదృచ్ఛిక సంఘటన చోటు చేసుకుంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ విషయంలో 18 ఏళ్ల తర్వాత ఓ ఫీట్ రిపీటైంది. 2008 ఏప్రిల్ 18న కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో, నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచులోనూ విరాట్ ఒక్క పరుగే చేశారు. ఈ రెండు మ్యాచులూ చిన్నస్వామి స్టేడియం వేదికగానే జరగడం గమనార్హం. కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18 కావడం గమనార్హం.

News April 19, 2025

విచారణకు హాజరైన మిథున్ రెడ్డి

image

AP: మద్యం కేసులో విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. నిన్న విజయసాయి రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది.

News April 19, 2025

వివాహేతర సంబంధాన్ని నేరంగా చూడకూడదు: హైకోర్టు

image

వివాహేతర సంబంధం నేరమేమీ కాదని, అది నైతికతకు సంబంధించిన అంశమని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మహాభారత కాలంలోలాగా భార్యను భర్త ఆస్తిలాగా చూడకూడదని స్పష్టం చేసింది. కాగా తన భార్య మరో వ్యక్తితో హోటల్‌లో శారీరకంగా దగ్గరైందని, వారిని శిక్షించాలని భర్త మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు. దీంతో ఆ కోర్టు ప్రియుడికి నోటీసులు పంపింది. దీనిపై ప్రియుడు హైకోర్టుకు వెళ్లగా అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

error: Content is protected !!