News April 9, 2025

నిరుద్యోగులకు శుభవార్త.. రేపు పాల్వంచలో జాబ్ మేళా

image

జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరాం శుభవార్త చెప్పారు. ఇంటర్, డిగ్రీ, పీజీ చదివి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు గలవారు ఈనెల 10న ఉదయం 10 గంటలకు పాల్వంచ డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. పలు ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ 5, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 20, రిలేషన్షిప్ ఆఫీసర్స్ 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అర్హత ధ్రువపత్రాలతో రావాలని సూచించారు.

Similar News

News September 18, 2025

శ్రీరాంపూర్: ‘జీఎం కార్యాలయాల ముట్టడి జయప్రదం చేయాలి’

image

సింగరేణి యాజమాన్యం అవలంబిస్తోన్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం జరిగే జీఎం కార్యాలయాల ముట్టడిని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7, ఎస్ఆర్పీ 3గనుల్లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. దసరా పండుగ సమీపిస్తున్నా సంస్థకు వచ్చిన లాభాలు, కార్మికులకు ఇచ్చే వాటాను ఇంతవరకు ప్రకటించక పోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

News September 18, 2025

పాడేరు: గ్యాస్ అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చర్యలు

image

గ్యాస్ సిలిండర్‌ను కంపెనీ ఇచ్చిన రేట్ల కన్నా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ డీలర్లను హెచ్చరించారు. గురువారం పాడేరులోని కలెక్టరేట్‌లో పౌర సరఫరాల అధికారులు, గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. గ్యాస్‌కు అదనంగా వసూలు చేస్తున్నారని లబ్దిదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

News September 18, 2025

జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్‌.. అర్థమదేనా?

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్‌లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?