News April 9, 2025
చోరీ నగదే హత్యకు కారణం: అనకాపల్లి డీఎస్పీ

చెన్నైలో చేసిన చోరీ సొమ్ము విషయంలో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదంతోనే కొలిపాక పవన్ కుమార్ హత్యకు గురయ్యాడని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మంగళవారం తెలిపారు. గ్రామానికి చెందిన వేపాడ నరేంద్ర కుమార్ చెన్నైలో చోరీ చేసిన సొమ్ముతో ఇక్కడకు వచ్చి స్నేహితులతో జల్సా చేశాడన్నారు. ఈ క్రమంలో కొంత సొమ్ము హతుడు పవన్ కుమార్ దొంగలించాడన్న అనుమానంతో నరేంద్ర కుమార్ బీరు సీసాతో పొడిచి హత్య చేశాడని వెల్లడించారు.
Similar News
News November 6, 2025
‘ఫ్యాషన్ పెళ్లిళ్లు వద్దు’

ఉమ్మడి అనంత జిల్లాల ప్రభుత్వ ఖాజీలు గుంతకల్లు ప్రభుత్వ ఖాజీ కార్యాలయంలో బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. సినిమా షూటింగ్‌లు, ఫొటో సెషన్‌ల ప్రదర్శనతో నిఖా పవిత్రత కోల్పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిఖా కేవలం ఇస్లామియా పద్ధతిలో సంప్రదాయంగా జరగాలన్నారు. ఫ్యాషన్ పెళ్లిళ్లకు దూరంగా ఉండాలని, సంప్రదాయ నిఖా విధానాల పునరుద్ధరణ చేయాలని అన్నారు. నిజమైన దైవబంధాన్ని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.
News November 6, 2025
కర్నూలులో నేడే జాబ్ మేళా

కర్నూలులో ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 6న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి దీప్తి తెలిపారు. ఈ మేళాలో రిలయన్స్ కన్స్యూమర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ ఖాళీలు 120 ఉన్నాయన్నారు. ఐటీఐ/డిప్లొమా చదివిన విద్యార్థులు అర్హులన్నారు. నిరుద్యోగ యువత ముందుగా ఎన్‌సీఎస్ వెబ్సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
News November 6, 2025
ఆర్డీవోలు తహశీల్దార్లతో సమీక్షించాలి: VZM కలెక్టర్

రెవెన్యూ సేవల కోసం అందిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ వినతులు ఉంటే సహించేది లేదన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, OBC, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యుటేషన్లు వంటి సేవలు నిర్దేశిత గడువు దాటకుండా పూర్తవ్వాలని, ఆర్‌డీవోలు రోజువారీగా తహశీల్దార్లతో సమీక్షించాలన్నారు.


