News April 9, 2025
కొనసాగుతున్న అల్పపీడనం

AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. దీంతో ఈరోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక 11న ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఏలూరులో 5 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 2, గుంటూరులో 9, పల్నాడులో 2 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Similar News
News July 6, 2025
మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్

రెండో టెస్టులో భారత్ సంధించిన భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టమని, పిచ్ తీరును బట్టి తమ బ్యాటర్లు ఆడతారని ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ అన్నారు. తామేమీ పిచ్చోళ్లం కాదని గెలుపు కుదరకపోతే డ్రా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ‘ఒక్క రోజులో 550కుపైగా పరుగులు చేయడం అసాధ్యం. కానీ మా బ్యాటర్లు మాత్రం పోరాటం ఆపరు’ అని ఆయన స్పష్టం చేశారు.
News July 6, 2025
PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <
News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <