News April 9, 2025
ఖమ్మంలో మిర్చిబోర్డు ఏర్పాటైతే క్వింటా రూ.25వేలు

మిర్చి సాగులో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో నిలువగా, రాష్ట్రంలో ఖమ్మం ప్రథమ స్థానంలో ఉంది. కానీ ఖమ్మం మిర్చి రైతుల చిరకాల వాంఛ మిర్చి బోర్డు ఏర్పాటుపై సంధిగ్ధo నెలకొంది. ప్రస్తుతం ధరలు క్వింటాకు రూ.13-15 వేల మధ్యే నడుస్తుండగా, బోర్డు ఏర్పాటైతే రూ.20-25 వేలు పలుకుతుందనే ఆశలు వారిలో రేకేత్తిస్తున్నాయ్. నిర్ణీత ధర లేక నష్టపోతున్న రైతన్నలు బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News April 19, 2025
ఊట్కూర్‌లో పురాతన మఠాల చరిత్ర తెలుసా..?

మన దేశం అనేక సంస్థానాలు, మఠాలతో అలనాడు ఓ వెలుగు వెలిగింది. ఈ పరంపరలో NRPT జిల్లా ఊట్కూరులోని మాగనూరు నేరడుగం పురాతన పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం ఒకటి. ఈ మఠాన్ని శ్రీసిద్ధ లింగేశ్వర మహాస్వామి స్థాపించారు. అనంతరం 1900-1914 కాలంలో 2వ సిద్ధలింగ మహాస్వామి సంకల్ప అనుష్టానంతో 12 స్థలాల్లో మఠాలు నెలకొల్పారు. అందులో ఒకటి ఊట్కూర్‌లోని పురాతన మఠం. ఇక్కడ పేద పిల్లలకు విద్య అందించారని స్థానికులు తెలిపారు.
News April 19, 2025
‘పెద్ది’లో కాజల్ స్పెషల్ సాంగ్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ మూవీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కాజల్‌ను మూవీ యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు టాక్.
News April 19, 2025
పల్నాడు జిల్లాకు మహర్దశ

రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌లో జిల్లాను కలపటంతో పల్నాడుకు మహర్దశ పట్టింది. కొండమోడు పేరేచర్ల హైవే పనులు ప్రారంభానికి సిద్ధం కావడంతో అమరావతికి రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. కృష్ణానది పరివాహ ప్రాంతం కావడంతో పాటు నాగార్జునసాగర్, పులిచింతల, ఎత్తిపోతల, అమరావతి, కొండవీడు, కోటప్పకొండ, దైద, గుత్తికొండ వంటి పర్యాటక ప్రాంతాలు జిల్లా పరిధిలోకి ఉండటంతో బలమైన జిల్లాగా రూపాంతరం చెందింది.