News April 9, 2025
సూర్యాపేట: వాహన తనిఖీల్లో గంజాయి పట్టివేత

సూర్యాపేటలో 1.20 కేజీల గంజాయి పట్టుబడింది. పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ వీర రాఘవులు వివరాలు వెల్లడించారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వారిని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఏపీలోని అరకు నుంచి గంజాయిని కొనుగోలు చేసి వస్తున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.
Similar News
News January 10, 2026
చిరు మూవీ టికెట్ ధరలు పెంపు.. HCలో పిటిషన్

TG: మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్(అత్యవసర విచారణ) దాఖలైంది. దీనిపై సెలవుల తర్వాత విచారిస్తామని కోర్టు పేర్కొంది. ప్రీమియర్ షోల ప్రదర్శనకు అనుమతిస్తూ, రెగ్యులర్ షోల టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇటీవల <<18809035>>రాజాసాబ్<<>> టికెట్ల పెంపుపై HC ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే MSVP బుకింగ్స్ మొదలయ్యాయి.
News January 10, 2026
20 డ్రోన్ కెమెరాలతో నిఘా: మేడారం SP

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈసారి ప్రత్యేక నిఘా ఏర్పాట్లను చేసినట్లు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ తెలిపారు. జాతరలో మునుపేన్నడు లేనివిధంగా 20 డ్రోన్ కెమెరాలను సిద్ధం చేస్తున్నామన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా పర్యవేక్షణ చేస్తామని, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుంటారన్నారు. జంపన్నవాగు, ఆర్టీసీ, గద్దెలు, ప్రధాన కూడళ్లలో సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
News January 10, 2026
నీటి విషయంలో రాజీపడేది లేదు: CBN

AP: నీటి విషయంలో గొడవలకు దిగితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని సీఎం చంద్రబాబు అన్నారు. ‘నీటి సద్వినియోగం వల్లే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చెందింది. 2020లో నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్‌తో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. మట్టి పనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం.. నీటి విషయంలో రాజీ లేదు’ అని టీడీపీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు.


