News April 9, 2025

జమ్మికుంట: నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులపై దూసుకెళ్లిన కారు

image

నిద్రిస్తున్న వ్యక్తులపై కారు దూసుకెళ్లిన ఘటన జమ్మికుంటలో చోటుచేసుకుంది. సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. లారీ డ్రైవర్లు సుమన్ కుమార్ మహత్, పబిత్ర మాజీ సోమవారం రాత్రి 10.30లకు ఆదిత్య కాటన్ ఇండస్ట్రీస్ ఎదురుగా నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో మోత్కులగూడెంకు చెందిన పొనగంటి సాత్విక్ కారును అజాగ్రత్తగా నడుపుకుంటూ.. వాళ్ల కాళ్ల మీద నుంచి వెళ్లాడు. దీంతో వాళ్ల కాళ్ల విరిగిపోయాయి.

Similar News

News March 1, 2026

మండపేట: క్షణికావేశంలో హత్య.. కటకటాలపాలైన అన్నదమ్ములు

image

మండపేట మండలం ద్వారపూడిలో గురువారం రాత్రి జరిగిన హత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితులైన అన్నదమ్ములు అయినవిల్లి చంద్రపాల్, గిరిబాబు పోలుపల్లి వీర వెంకట సూర్య ప్రకాశరావును రాళ్లతో కొట్టి అతి దారుణంగా చంపారు. ఆవేశంలో చేసిన ఈ దాడితో సూర్య ప్రకాశరావు మృతి చెందగా, నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 1, 2026

కనువిందుగా భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.

News March 1, 2026

నల్గొండ: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

image

జిల్లాలో యాసంగి సాగు పనులు చివరి దశకు చేరుకున్నా, పెట్టుబడి సాయం అందక 10.82 లక్షల మంది అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఏటా నవంబర్‌లోనే విడుదల కావాల్సిన ‘రైతు భరోసా’ నిధులు ఇప్పటికీ ఖాతాల్లో జమ కాకపోవడంతో వరి, మిర్చి సాగుదారులు అప్పుల కోసం ఎదురుచూస్తున్నారు. సాగు కాలం ముగుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.