News April 9, 2025
వరంగల్: వారు దరఖాస్తు చేసుకోండి!

ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో పని చేస్తున్న అర్హత కలిగిన అభ్యర్థులు జులై- 2025లో ప్రైవేట్ అభ్యర్థులుగా ఐటీఐ పరీక్షలు రాసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏటూరునాగారం ఐటీఐ ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లలో 3 ఏళ్లు పైబడిన సర్వీస్ సర్టిఫికెట్, ఎంప్లాయ్ గుర్తింపు కార్డు సమర్పించి ములుగు రోడ్డు వరంగల్ కార్యాలయంలో ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News September 18, 2025
VKB: అత్త శ్రద్ధాంజలి బ్యానర్ తీసుకెళ్తూ అల్లుడు మృతి

VKB జిల్లా పుల్‌మద్ది గ్రామంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన లక్ష్మి మరణించడంతో ఆమె శ్రద్ధాంజలి బ్యానర్‌ని అల్లుడు శ్రీనివాస్ పట్టణంలో ప్రింట్ చేసుకొని తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు గుంతలో బైక్ పడి కింద పడడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం శ్రీనివాస్‌పై నుంచి వెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అత్త, అల్లుడు మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
News September 18, 2025
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

AP: ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 10 రోజుల వరకు సభ నిర్వహించే అవకాశముంది. పంచాయతీరాజ్ సవరణ, AP మోటార్ వెహికల్ ట్యాక్స్, SC వర్గీకరణ, మున్సిపల్ చట్టాల సవరణ వంటి 6 ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది. సూపర్-6 మొదలు సాగునీటి ప్రాజెక్టుల వరకు 20 అంశాలపై చర్చించేందుకు TDP ప్రతిపాదించొచ్చు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకెళ్లాలని YCP నిర్ణయించుకున్నట్లు సమాచారం.
News September 18, 2025
ధరూర్: పాత ఫోన్లు కొంటున్నారా: ఎస్ఐ

సెకండ్ హ్యాండ్ ఫోన్లతో జాగ్రత్త అవసరమని ఎస్ఐ రాఘవేందర్ హెచ్చరించారు. దొంగలించిన ఫోన్లు లేదా నేరాలను వాడినా ఫోన్లను తక్కువ ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. వాటిని కొంటే చిక్కుల్లో పడతారని చెప్పారు. కొనుగోలు చేసే ముందు www.ceir.gov.in, వెబ్ సెట్ లో వివరాలు తనిఖీ చేయాలనీ సూచించారు.