News April 9, 2025

మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం

image

మొయినాబాద్‌లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏడుగురు యువతులు, 14 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాలిడే ఫామ్ హౌస్‌లో తెల్లవారుజామున SOT పోలీసులు దాడులు నిర్వహించి మద్యం బాటిళ్లతో పాటు 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్, ముంబైతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి అర్ధనగ్నంగా డాన్సులు చేయించిన్నట్లు సమాచారం.

Similar News

News September 17, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ పోటీ

image

త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేషనల్ కో-ఆర్డినేటర్ ఎస్ మోహన్ రావు తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్‌లో పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత జెన్ని మహంతి శ్రీనివాస్ పోటీ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అవినీతి లేని సమాజ నిర్మాణమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.

News September 16, 2025

రక్షణ శాఖ మంత్రికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

image

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం పికెట్ గార్డెన్‌లో అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

News September 16, 2025

HYD: పూడిక తీయండి.. సమస్య తీర్చండి!

image

నగరంలో వర్షం వచ్చిన ప్రతిసారి చాలాచోట్ల వరదనీరు నిలిచిపోతోంది. కారణం ఆయా ప్రాంతాల్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడమే. ఇలాంటి 40 ప్రాంతాలను హైడ్రా గుర్తించింది. అక్కడ డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను యుద్ధప్రాతిపదికన తొలగించడానికి  హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నడుంబిగించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పూడిక తొలగిస్తే వరదనీటి సమస్యకు పరిష్కారం లభించినట్లవుతుంది.