News April 9, 2025
మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం

మొయినాబాద్‌లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏడుగురు యువతులు, 14 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాలిడే ఫామ్ హౌస్‌లో తెల్లవారుజామున SOT పోలీసులు దాడులు నిర్వహించి మద్యం బాటిళ్లతో పాటు 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్, ముంబైతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి అర్ధనగ్నంగా డాన్సులు చేయించిన్నట్లు సమాచారం.
Similar News
News July 6, 2025
గుడిమల్కాపూర్ మార్కెట్ తరలింపునకు ఏర్పాట్లు?

నగరంలో అతిపెద్ద పూల మార్కెట్ గుడిమల్కాపూర్ మార్కెట్. రోజు రోజుకు రద్దీ పెరుగుతుండడంతో ఇరుకుగా మారుతోంది. ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీంతో మార్కెట్‌ను నగర శివారుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పూలు, పండ్లు, కూరగాయల అన్నిటికి వేదికగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం 150 ఎకరాల స్థలం అవసరం ఉందని అంచనా వేసిన అధికారులు భూముల లభ్యతను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
News July 6, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం కలెక్టరేట్‌లో జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఆదివారం తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లో, MRO కార్యాలయాల్లో అర్జీలను ఇవ్వవచ్చని ఆయన తెలిపారు.
News July 6, 2025
PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <