News April 9, 2025

భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి దేవస్థానంలో బుధవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.

Similar News

News January 16, 2026

తిరుపతి: ఆ సమస్యకు పరిష్కారం ఎప్పుడు…?

image

TTD, రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా ప్రజలు భూ సమస్యను ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో శేషసాయి నగర్‌లో ఉన్న భూములను 22A క్రింద తీసుకొచ్చారు. దీంతో ఈ ల్యాండ్స్ లేఅవుట్ అనుమతులు, రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు రాకుండా నిలిచిపోయాయి. 22A నిబంధనలు, IDT క్లెయిమ్స్ వల్ల చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములను అనుభవించలేక, వేరొకరికి అమ్మలేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

News January 16, 2026

సింహాచలంలో 18న అప్పన్న తెప్పోత్సవం

image

వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 18న (ఆదివారం) వరాహ పుష్కరిణిలో వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపై నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉత్సవం కారణంగా ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.