News March 27, 2024

నేడు హైదరాబాద్, ముంబై ఫైట్

image

IPLలో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో SRH, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచుల్లో ఓడిపోవడంతో.. ఇవాళ గెలిచి బోణీ కొట్టాలని చూస్తున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరి ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.

Similar News

News March 25, 2026

అమరావతిలో అగ్నిప్రమాదాలు.. దర్యాప్తు ముమ్మరం

image

AP: అమరావతిలో అగ్నిప్రమాదాలపై పోలీసు శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. CCTV ఫుటేజ్‌లను పరిశీలిస్తూ ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరిస్తోంది. ఇటీవల L&T కంపెనీ, తాజాగా మేఘా ఇంజినీరింగ్ కంపెనీ పైపులు దగ్ధమైన సంగతి తెలిసిందే. అయితే అవి 130 డిగ్రీల వేడికి తప్ప చిన్న మంటలకు దగ్ధం కావనేది నిపుణుల అభిప్రాయం. కాగా వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర ఉండొచ్చని <<19466902>>CM అనుమానం<<>> వ్యక్తం చేశారు.

News March 25, 2026

ఓవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

image

AP: రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల్లో ఎండల తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ‘ఎల్‌ నినో’ కారణంగా ఈసారి ఉష్ణోగ్రతలు గత ఏడాది కంటే 2-4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది. మరోవైపు ఈనెల 28 వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27,28 తేదీల్లో గంటకు 40-60kms వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం సహా పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

News March 25, 2026

డీలిమిటేషన్ ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగింది?

image

రాజ్యాంగం ప్రకారం పదేళ్లకోసారి <<19460921>>డీలిమిటేషన్<<>> (జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో సీట్ల పెంపు, నియోజకవర్గాల సరిహద్దుల సర్దుబాటు) చేపట్టాలి. గతంలో 1952, 1963, 1973లో చేపట్టారు. ఆ తర్వాత జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలకు నష్టం జరగొద్దని 25yrs నిలిపివేశారు. ఆ తర్వాత కూడా అవే పరిస్థితులు ఉండటంతో మరో 25yrs పొడిగించారు. 2002లో డీలిమిటేషన్ చేపట్టినా సీట్ల సంఖ్య పెంచకుండా నియోజకవర్గ పరిధులను మాత్రమే మార్చారు.