News April 9, 2025
పార్వతీపురం : కంటైనర్‌లో అంగన్వాడీ కేంద్రం

పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో కంటైనర్‌లో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సీడీపీఓ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామంలో ఐదవ అంగన్వాడీ నిర్వహణకు సచివాలయం వద్ద కంటైనర్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే సాలూరులో ఆసుపత్రులను సైతం కంటైనర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 19, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఓదెల 41.5℃ నమోదు కాగా అంతర్గం 41.3, సుల్తానాబాద్ 40.7, పాలకుర్తి 40.6, పెద్దపల్లి 40.6, రామగుండం 40.1, ఎలిగేడు 40.0, జూలపల్లి 39.7, కమాన్పూర్ 39.6, రామగిరి 39.5, మంథని 39.3, ధర్మారం 39.3, కాల్వ శ్రీరాంపూర్ 39.2, ముత్తారం 39.8℃ గా నమోదయ్యాయి.
News April 19, 2025
‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా నిన్న థియేటర్లలో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.15 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఎమోషనల్ బ్లాక్ బస్టర్’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.
News April 19, 2025
అనంతపురం జిల్లాలో 72 అటెండర్ పోస్టులు

అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 72 అటెండర్ పోస్టుల భర్తీకి సర్వం సిద్ధం చేశామని DMHO దేవి తెలిపారు. ఇందులో MRI, MRN, OT టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, స్పీచ్ థెరపిస్ట్, నెట్ అడ్మినిస్ట్రేటర్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, పెర్ ప్యూజినిష్ట్, అటెండర్ పోస్టులు ఉన్నాయన్నారు. 2023 నవంబర్‌లో వచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.