News April 9, 2025
ప్రకాశం జిల్లాలో ముగ్గురు మృతి

ప్రకాశం జిల్లాలో వేరు వేరు ఘటనలలో మంగళవారం ముగ్గురు మృతి చెందారు. టంగుటూరు మండలం వల్లూరు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం, బైక్‌ను ఢీకొట్టడంతో వర్ధన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. టంగుటూరులోని రైల్వే గేట్ వద్ద విశ్రాంత ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. అర్ధవీడులో మద్యం మత్తులో కన్న తండ్రి, కుమారుడిని కత్తితో పొడవటంతో తీవ్రగాయాలతో షాకీర్ మృతి చెందాడు.
Similar News
News November 9, 2025
ఒంగోలు: మీరు వెళ్లే బస్సు బాగుందా? లేదా?

వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. చాలా వాటిపై కేసులు నమోదు చేశారు. స్కూళ్లు, కాలేజీ బస్సుల పనితీరుపైనా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దీంతో సంతనూతలపాడు పోలీస్‌లు శనివారం ప్రైవేట్ స్కూల్ బస్సులను చెక్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? లేదా? అని తీశారు. మీరు వెళ్లే స్కూల్/కాలేజీ బస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 9, 2025
ప్రకాశం జిల్లా ప్రజలకు గమనిక

సీఎం చంద్రబాబు ఈనెల 11న ప్రకాశం జిల్లాకు రానున్నారు. ఈనేపథ్యంలో ఈనెల 10న సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి దూర ప్రాంతాల నుంచి ఎవరూ ఒంగోలుకు రావద్దని సూచించారు.
News November 9, 2025
‘మీ కోసం’ రద్దు: కలెక్టర్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి ఎవరూ అర్జీలు అందించేందుకు జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు.


