News April 9, 2025

వరంగల్‌లో CONGRESS VS BRS

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRS నేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRS నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?

Similar News

News January 26, 2026

ప్రధాని నోట అనంతపురం మాట.. మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు

image

మన్ కీ బాత్‌లో అనంతపురం ‘అనంత నీరు సంరక్షణ ప్రాజెక్టు’ను ప్రశంసించిన ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. 10కి పైగా రిజర్వాయర్ల పునరుద్ధరణ, 7 వేల మొక్కలు నాటడం వంటి ప్రజల సామూహిక కృషిని ప్రధాని గుర్తించడం గర్వకారణమని లోకేశ్ ట్వీట్ చేశారు. నీటి భద్రత కోసం అనంతపురం జిల్లా ప్రజలు చేస్తున్న పోరాటం జాతీయ స్థాయిలో వెలుగులోకి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

News January 26, 2026

బంగారం ధర.. ఆల్ టైమ్ రికార్డు

image

ఇంటర్నేషనల్ మార్కెట్‌లో చరిత్రలో తొలిసారి ఔన్స్ (28.35గ్రా) బంగారం $5,000కి (₹4.59L) చేరింది. ఒక ఔన్స్ సిల్వర్ $100గా ఉంది. 2025లో గోల్డ్ రేట్ 60%, వెండి 150% పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. US-NATO, ఇరాన్, గ్రీన్లాండ్ టెన్షన్స్, ట్రంప్ టారిఫ్స్ వంటివి దీనికి కారణాలుగా చెబుతున్నాయి. 2026 చివరికి బంగారం ఔన్స్ $5,400కి చేరొచ్చని అంచనా. ఈ పెరుగుదల భారత్ సహా ఇతర మార్కెట్లపైనా ప్రభావం చూపనుంది.

News January 26, 2026

HYD: బండ్లపై ఈ స్టిక్కర్లు వేసుకోవద్దు!

image

వాహనాలపై అనధికారికంగా ప్రెస్, అడ్వకేట్, ప్రభుత్వ చిహ్నాలు, HRC స్టిక్కర్లు వాడటంపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. సమాచార పౌర సంబంధాల శాఖ గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు మాత్రమే ‘PRESS’అని రాసుకోవాలని, అదీ నంబర్ ప్లేట్లపై ఉండకూడదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించింది.