News April 9, 2025
వరంగల్‌లో CONGRESS VS BRS

ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRS నేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRS నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?
Similar News
News November 10, 2025
వేములవాడ: రాజన్న కళ్యాణం.. అరకొర టికెట్లతో నిరాశలో భక్తులు

వేములవాడ రాజన్న నిత్యకళ్యాణం టికెట్ల విషయంలో భక్తులు నిరాశకు లోనవుతున్నారు. గతంలో విశాల కళాభవనంలో భక్తులు నిత్యకళ్యాణం మొక్కులు చెల్లించేవారు. ఆలయ విస్తరణ నేపథ్యంలో భీమేశ్వరాలయం ఎదురుగా ఉన్న నిత్యఅన్నదాన సత్రం పైఅంతస్తులో ఈ క్రతువును జరిపిస్తున్నారు. గతంలో 150 జంటలకు టికెట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని 90కి తగ్గించేశారు. టికెట్లు తీసుకునే సమయంలో ఇక్కడ తోపులాట సైతం జరుగుతుందని పలువురు పేర్కొన్నారు.
News November 10, 2025
రీఓపెన్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రీఓపెన్ అయిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 192 విజ్ఞప్తులను స్వీకరించినట్లు తెలిపారు. రీ ఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
News November 10, 2025
NGKL: ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

NGKL కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 51 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పెండింగ్‌లో పెట్టకుండా, వెంటనే పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బధావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతోనే ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని, అందుకే అన్ని శాఖల అధికారులు వాటిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.


