News April 9, 2025

భద్రాచలం డిపో ఆదాయం రూ.92.61 లక్షలు

image

భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం పురస్కరించుకుని భద్రాచలం డిపో పరిధిలో ఏప్రిల్ 5 నుంచి 7 వరకు వివిధ మార్గాలలో మొత్తం 78 ప్రత్యేక బస్సులు నడిపినట్లు డీఎం బి.తిరుపతి తెలిపారు. ఈ మూడు రోజుల్లో ప్రత్యేక బస్సులు మొత్తం రూ.1,52,188 కి.మీ పయనించగా రూ.92.61 లక్షల ఆదాయం డిపోకు లభించిందన్నారు. మొత్తం 82,138 మంది ప్రయాణించగా వారిలో 37,639 మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారని చెప్పారు.

Similar News

News October 14, 2025

జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కర్నూలుకు బంగారు పతకాలు

image

ఈనెల 10 నుంచి 14 వరకు భువనేశ్వర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో అండర్-20 విభాగంలో కర్నూలుకు చెందిన అథ్లెట్ మొగిలి వెంకట్రామిరెడ్డి ఏపీ తరఫున పాల్గొని బంగారు పతకాలు సాధించాడు. 800, 1500 మీటర్ల పరుగు పోటీల్లో ఈ ఘనత సాధించిన వెంకట్రామిరెడ్డిని అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడా ప్రతినిధులు హర్షవర్ధన్ మంగళవారం ఓ ప్రకటనలో అభినందించారు.

News October 14, 2025

మెదక్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

image

మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావును ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే రక్తదాన శిబిరంపై చర్చించారు. పోలీస్ హెడ్ క్వార్టర్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

News October 14, 2025

రామాయంపేట: ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి’

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. రామాయంపేట మండలం కోనాపూర్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం నిర్మాణం చేపడితే సకాలంలో బిల్లులు చెల్లిస్తామని పేర్కొన్నారు.