News March 27, 2024

CM జగన్ ఒక సంఘ సంస్కర్త: ఆర్.కృష్ణయ్య

image

AP: బీసీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక సీఎం జగన్ అని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. జగన్ రాజకీయ నాయకుడు కాదని, ఒక సంఘ సంస్కర్త అని ప్రశంసించారు. బీసీలను గత ప్రభుత్వం ఓటుబ్యాంకుగా మాత్రమే చూసిందని, జగన్ మాత్రం సామాజిక న్యాయం అమలు చేస్తున్నారని తెలిపారు. 11 ఎంపీ, 58 ఎమ్మెల్యే సీట్లను బీసీలకు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అంబేడ్కర్ ఆలోచనావిధానంతో జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు.

Similar News

News October 4, 2024

అమరావతి మీదుగా NH-16 విస్తరణ: పెమ్మసాని

image

AP: కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే NH-16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. వినుకొండ-గుంటూరు 2 లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించి మరో 25KM పొడిగించారన్నారు. ఇది రాజధాని అమరావతిని తాకేలా రూపొందిందని, దీనివల్ల ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా NHAI నిర్మిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, విద్యుత్ పనులు చేపడుతుందని తెలిపారు.

News October 4, 2024

మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్

image

దేశంలోని మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరాఠీ, బెంగాలీ, పాళీ, ప్రాకృత, అస్సామీ భాషలకు ఈ స్థాయిని కల్పించనుంది. దీంతో వీటితో కలిపి దేశంలోని సాంప్రదాయ భాషల సంఖ్య 11కు చేరనుంది. ఇప్పటివరకు తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలు మాత్రమే ఈ స్టేటస్‌ను కలిగి ఉన్నాయి.

News October 4, 2024

ఆ పథకాన్ని తొలగించట్లేదు: ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం

image

AP: రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయరంటూ మరోసారి ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని(గతంలో ఆరోగ్య శ్రీ) తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారమని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జీవో ఫేక్ అని తెలిపింది.