News April 9, 2025

అనకాపల్లిలో 95% మూల్యాంకనం పూర్తి: డీఈవో

image

అనకాపల్లి జిల్లాలో పదవ తరగతి పరీక్షల పేపర్ల మూల్యాంకన ప్రక్రియ తుదిదశకు చేరినట్లు డీఈవో జి.అప్పారావు నాయుడు తెలిపారు. మంగళవారం అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ.. మూడు కేంద్రాల్లో ఈనెల మూడో తేదీ నుంచి మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు. జిల్లాకు 1,66,237 జవాబు పత్రాలు వచ్చాయన్నారు. 594 మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. 95 శాతం మూల్యాంకనం పూర్తయిందన్నారు.

Similar News

News December 29, 2025

జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు

image

TG: జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని BAC మీటింగ్‌లో నిర్ణయించారు. 4న ఆదివారం సెలవు ఉండనుంది. దీంతో కొత్త సంవత్సరంలో 5 రోజులు సమావేశాలు జరగనున్నాయి. అయితే, 15 రోజులు అసెంబ్లీని నిర్వహించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలు పక్కదారిపట్టేలా BRS, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని BJP రాష్ట్రాధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. INC హామీలపై చర్చ జరగాలన్నారు.

News December 29, 2025

సూర్యాపేట: యూరియా పట్ల రైతులు ఆందోళన చెందొద్దు.!

image

సూర్యాపేట జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. సోమవారం అధికారులతో సమీక్షించిన ఆయన.. ప్రస్తుతం 10,508 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే 6281492368 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News December 29, 2025

గజగజ.. రేపు కూడా కొనసాగనున్న చలి తీవ్రత!

image

TGలో రేపు కూడా చలి తీవ్రత కొనసాగనుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ADB, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, MDK, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో 5-10 డిగ్రీల మధ్య టెంపరేచర్ నమోదవుతుందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో 11-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని చెప్పింది. ఉదయం, రాత్రివేళల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బయటికి వెళ్తే తప్పనిసరిగా స్వెటర్లు ధరించాలని వైద్యులు సూచించారు.