News April 9, 2025
ప్రజల వద్దకే పాస్‌పోర్ట్ సేవలు

AP: మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇంటివద్దే పాస్‌పోర్ట్ సేవలు అందించేందుకు ‘మొబైల్ వ్యాన్’ను అధికారులు సిద్ధం చేశారు. ఈ వ్యాన్ ఏ రోజు రూట్‌లో ప్రయాణిస్తుందో వెబ్‌సైట్‌లో ఉంచుతారు. దాన్ని బట్టి స్లాట్ బుక్ చేసుకుంటే మీ ప్రాంతంలోనే సర్టిఫికెట్ల పరిశీలన, వేలిముద్రలు, ఫొటోలు తీసుకుని ప్రక్రియ పూర్తి చేస్తారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక పోస్టులో పాస్‌పోర్టు పంపుతారు.
Similar News
News January 25, 2026
చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ అదేనా?

వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా రిలీజ్ డేట్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. జులై 10న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆశిక రంగనాథ్, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
News January 25, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 25, 2026
T20 WC నుంచి ఔట్.. BCB వివరణ ఇదే

T20 WC నుంచి వైదొలగడం అనేది తమ దేశ ప్రభుత్వ నిర్ణయమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ అమ్జద్ హొస్సేన్ తెలిపారు. ‘మేం ఆడాలనుకున్నాం. కానీ భారత్‌లో ఆడటం సేఫ్ కాదని ప్రభుత్వం వద్దని చెప్పింది. ప్రతి టూర్‌కు ప్రభుత్వ క్లియరెన్స్ తప్పనిసరి’ అని అమ్జద్ వివరించారు. ‘మ్యాచులు జరిగే ఓ సిటీ(కోల్‌కతా) నుంచి మాకు బెదిరింపులు వచ్చాయి. అందుకే అక్కడ ఆడటం సేఫ్ కాదని అనిపించింది’ అని పేర్కొన్నారు.


