News March 27, 2024

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ఇదే లాస్ట్ ఛాన్స్

image

TG: గ్రూప్-1 దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఇవాళ సా.5 గంటల వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. 563 గ్రూప్-1 పోస్టులకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 మెయిన్స్ పరీక్ష జరగనుంది. వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/

Similar News

News April 18, 2026

సోమవారం రెండో విడత శాంతి చర్చలు!

image

అమెరికా-ఇరాన్ రెండో విడత శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. అందుకు మరోసారి పాకిస్థాన్‌ను వేదికగా ఎంచుకున్నాయి. ఇస్లామాబాద్‌లో వచ్చే సోమవారం చర్చలు జరపనున్నట్లు సమాచారం. రేపు ఇరాన్ ప్రతినిధులు పాక్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడత చర్చలు విఫలమైన విషయం తెలిసిందే.

News April 18, 2026

పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.5000 ఎగసి రూ.2,80,000కి చేరింది.

News April 18, 2026

IPLలో అన్‌సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఇతడే..

image

IPL చరిత్రలో 25+ మ్యాచులకు నాయకత్వం వహించి అతి తక్కువ విన్నింగ్ పర్సంటేజ్(31.8%) కలిగిన కెప్టెన్‌గా అజింక్య రహానే నిలిచారు. ఆయన 44 మ్యాచులకు కెప్టెన్సీ చేయగా 14సార్లు మాత్రమే గెలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(33.3%), సంగక్కర (36.2%), ధవన్ (37%), గంగూలీ(40.5%) ఉన్నారు. కాగా ప్రస్తుత సీజన్‌లో రహానే కెప్టెన్సీలో KKR ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడగా ఐదింట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది.