News April 9, 2025

HYD: ప్రతీ జోన్‌లో ఒక్కో ఫుడ్ టెస్టింగ్ సెంటర్..!

image

గ్రేటర్ HYD వ్యాప్తంగా మొత్తం జీహెచ్ఎంసీలో 6 జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్‌లో ఒక్కోటి చొప్పున 6 ఆహార పరీక్షల కేంద్రాల ఏర్పాటుకు దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలను చూపించాల్సిందిగా, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు ఒక్కోదానికి రూ.5 కోట్ల చొప్పున రూ.30 కోట్ల నిధులు కూడా అందజేయాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ విభాగం జీహెచ్ఎంసీని కోరింది.

Similar News

News September 13, 2025

నకిరేకల్‌లో విద్యార్థినికి లైంగిక వేధింపులు..!

image

నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ టీచర్ విద్యార్థినిని వేధిస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఈ విషయం బయటపడింది. ఈ విషయాన్ని బయటపెట్టకుండా రాజీ చేసేందుకు కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రయత్నించినట్లు తెలిసింది. బాధితురాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 13, 2025

1GB ప్లాన్ ఎత్తేయడంపై వివరణ కోరిన TRAI

image

సరసమైన 1GB ఎంట్రీలెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ ఉపసంహరణకు గల కారణాలను తెలపాలని JIO, AIRTEL సంస్థలను TRAI కోరింది. రూ.249 ప్లాన్ ఎత్తేయడంతో వినియోగదారులపై మరింత భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్‌లైన్‌లో ఈ ప్లాన్ అందుబాటులో ఉందని JIO తెలుపగా.. వినియోగదారుల ప్రాధాన్యతల ఆధారంగా రూ.249 ప్లాన్‌ను తీసేసినట్లు AIRTEL పేర్కొంది. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ ప్లాన్ ₹299 నుంచి మొదలుకానుంది.

News September 13, 2025

కరీంనగర్: LMD రిజర్వాయర్‌లో వెరైటీ చేప..!

image

KNR జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన మత్స్యకారుడు బోళ్ల భూమయ్య రోజూలాగే చేపలు పట్టేందుకు శనివారం ఉదయం ఎల్ఎండీ రిజర్వాయర్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో వలలు తీస్తుండగా ఎర్రరంగులో ఉన్న వెరైటీ భారీ చేప అతడి కంటపడింది. కాగా, ఇలాంటి చేప ఇప్పటివరకు LMD రిజర్వాయర్‌లో లభించలేదని మత్స్యకారులు తెలిపారు. దీనిని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన చేపగా పలువురు చెబుతున్నారు. స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.