News April 9, 2025
సీఎం చంద్రబాబు కొత్త ఇంటికి భూమిపూజ

AP: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న తన కొత్త ఇంటికి సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. వెలగపూడి సచివాలయం వెనుక వైపు E-9 రోడ్ పక్కన ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. మొత్తం 1,455 చ.గజాల విస్తీర్ణంలో జీ+1 పద్ధతిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని సీఎం కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కాగా గతేడాది వెలగపూడి రెవెన్యూ పరిధిలో చంద్రబాబు 5 ఎకరాల స్థలం కొన్న విషయం తెలిసిందే.
Similar News
News January 2, 2026
సంక్రాంతికి రైతు భరోసా!

TG: సంక్రాంతి నాటికి అన్నదాతలకు రైతుభరోసా డబ్బులు అందించనున్నట్లు ప్రభుత్వానికి చెందిన ‘తెలంగాణ ఫ్యాక్ట్ చెక్’తెలిపింది. SMలో వైరల్ అవుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని పేర్కొంది. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయేతర భూములను ఏరివేసే పనిలో సర్కార్ ఉందని, అర్హులైన రైతులకు ఎకరానికి రూ.6000 చొప్పున పండగ నాటికి జమ చేయనుందని చెప్పింది. 4లక్షల ఎకరాలు కమర్షియల్ ల్యాండ్‌గా గుర్తించినట్లు వెల్లడించింది.
News January 2, 2026
కొత్త వాహనాలకు రోడ్ సేఫ్టీ సెస్: పొన్నం

TG: రోడ్ సేఫ్టీ సెస్‌పై మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను బలపరిచేందుకు రోడ్ సేఫ్టీ సెస్ విధించాలని నిర్ణయించాం. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు ఇది వర్తిస్తుంది. టూవీలర్స్‌కు రూ.2వేలు, కార్లలాంటి వాటికి రూ.5 వేలు, హెవీ వెహికల్స్‌కి రూ.10వేలు సెస్ విధిస్తాం’ అని తెలిపారు. APలో దీనిని 10%గా నిర్ణయించి క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
News January 2, 2026
మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం

కొంతకాలంగా తగ్గిన బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపిస్తోంది. కేరళలోని అలప్పుళ, కొట్టాయం జిల్లాల్లో అవైన్ ఇన్ఫ్లూయెంజా వైరస్‌ను గుర్తించారు. దీంతో వైరస్ కట్టడికి చర్యలు చేపట్టినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అటు నీలగిరి, కోయంబత్తూరు సహా కేరళ సరిహద్దు గల జిల్లాల్లో తమిళనాడు ప్రభుత్వం స్పెషల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. TNలోకి వైరస్ వ్యాపించకుండా కోళ్ల వ్యాన్స్‌ను వెటర్నరీ టీమ్స్ తనిఖీ చేస్తున్నాయి.


