News April 9, 2025

అమలాపురం: పెరిగిన గ్యాస్ ధరలతో మహిళల కన్నీళ్లు

image

రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం గ్యాస్ ధరలను పెంచింది. ఒక్కో సిలిండర్ రూ.50 పెరిగింది. ఇది మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. మొత్తం 17.97 లక్షల గ్యాస్ కనెక్షన్‌లు ఉండగా వినియోగదారులు రూ.8.98 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. కోనసీమ జిల్లాలో 5.30 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. రూ.881కి సిలెండర్ ధర చేరడంతో మహిళలు వాపోతున్నారు.

Similar News

News April 19, 2025

‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

image

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా నిన్న థియేటర్లలో రిలీజవగా మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.15 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఎమోషనల్ బ్లాక్ బస్టర్’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.

News April 19, 2025

అనంతపురం జిల్లాలో 72 అటెండర్ పోస్టులు

image

అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 72 అటెండర్ పోస్టుల భర్తీకి సర్వం సిద్ధం చేశామని DMHO దేవి తెలిపారు. ఇందులో MRI, MRN, OT టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, స్పీచ్ థెరపిస్ట్, నెట్ అడ్మినిస్ట్రేటర్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, పెర్ ప్యూజినిష్ట్, అటెండర్ పోస్టులు ఉన్నాయన్నారు. 2023 నవంబర్‌లో వచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.

News April 19, 2025

ముగ్గురు సత్యసాయి జిల్లా వాసులు మృతి.. Update

image

కర్నాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు శ్రీ సత్యసాయి జిల్లా వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరు కర్నాటకలోని రాయచూరు జిల్లాలో గొర్రెల రేటు తక్కువ ఉంటుందని కొనేందుకు బొలేరోలో పయనమయ్యారు. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో పరిగి మండలం ధనాపురానికి చెందిన నాగభూషణం(42) శీగుపల్లికి చెందిన మురళి(44) కోటిపికి చెందిన నాగరాజు(40) అక్కడికక్కడే మృతి చెందారు.

error: Content is protected !!