News March 27, 2024
IPL: ఉప్పల్ వెళుతున్నారా.. ఇది మీ కోసమే..!

నేడు ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో IPL మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 11:30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని రాచకొండ CP తరుణ్ జోషి తెలిపారు. లారీ, డంపర్, వాటర్ ట్యాంకర్లు, మట్టి తరలించే వాహనాలు, రెడీ మిక్స్ ట్రక్ తదితర భారీ వాహనాలను దారి మళ్లించనున్నారు. ఉప్పల్ టయోటా షోరూం, నాగోల్ మెట్రో స్టేషన్ యూటర్న్, హబ్సిగూడ క్రాస్ రోడ్ వద్ద డైవర్షన్ పాయింట్లు పెట్టారు. SHARE IT
Similar News
News March 20, 2026
HYD: గూడు చెదిరింది.. గుండె పగిలింది!

మూసీ రివర్ ఫ్రంట్ కోసం దాదాపు 10,235 అక్రమ కట్టడాలను LiDAR సర్వే ద్వారా ప్రభుత్వం గుర్తించింది. బడ్జెట్‌లో వీరికి డబుల్ బెడ్రూం ఇళ్లు, ₹25,000 ఆర్థిక సాయం ప్రకటించినా క్షేత్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం ఇల్లు ఇస్తే సరిపోదు, తరతరాలుగా నగర నడిబొడ్డున ఉపాధి పొందుతున్న వారి జీవనోపాధి పరిస్థితి ఏంటని, అభివృద్ధి అంటే మనుషులను వెళ్లగొట్టడం కాదు.. భాగస్వామ్యం చేయడం అని గుర్తు చేస్తున్నారు.
News March 20, 2026
మూసీ బడ్జెట్ బాగుంది.. మురికి పోతుందా?

తెలంగాణ బడ్జెట్ 2026-27లో మూసీ పునరుజ్జీవనానికి (CURE) సుమారు ₹1.5 లక్షల కోట్ల భారీ అంచనా వ్యయాన్ని ప్రకటించారు. మొదటి దశలో 21 కిలోమీటర్ల మేర ₹7,000 కోట్లతో పనులు మొదలవుతున్నాయి. 39 కొత్త ఎస్టీపీలు కడతామని చెబుతున్నా.. పారిశ్రామిక కెమికల్ వ్యర్థాలను అడ్డుకునే కఠిన చట్టాల ఊసే లేదు. కాలుష్యాన్ని ఆపకుండా చేసే ఈ ఖర్చు అంతా “నీళ్ల పాలే” అవుతుందన్నది విశ్లేషకుల హెచ్చరిక. దీనిపై మీ కామెంట్?
News March 20, 2026
‘వేదమందిర్’కు జ్యోతిషులు కావలెను!

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిషులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిషులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
<<7337592828>>Click on Whatsapp<<>>


