News April 9, 2025
నర్సీపట్నంలో అర్ధరాత్రి హత్య

నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీకి చెందిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. మంగళవారం అర్ధరాత్రి ప్రసాద్, మహేశ్ అనే ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని పంపించేశారు. పోలీసులు వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరిగి ప్రసాదును మహేశ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు.
Similar News
News December 28, 2025
ధారూరులో కాంగ్రెస్ నేతపై కత్తులతో దాడి!

స్థానిక సంస్థల ఎన్నికలలో ఓడిపోయిన నేతపై గెలిచిన నాయకులు కత్తులతో దాడి చేశారు. ధారూర్ మండలంలోని కొండాపూర్ కలాన్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో రెండు ప్రధాన పార్టీల మధ్య గొడవ జరిగింది. తాజాగా ఓడిపోయిన ఆంజనేయులుపై(INC) నేతపై గెలిచిన పార్టీ నాయకులు దాడి చేయడం కలకలం రేపింది. మెడ మీద గాయాలు కావడంతో ఆంజనేయులును హైదరాబాద్ తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం.
News December 28, 2025
సాగు కోసం వర్షపు నీటిని కాపాడుకుందాం

వ్యవసాయానికి వాన నీరే కీలకం. ఈ నీటిని పరిరక్షించి, భూగర్భ జలాలను పెంచుకోవడం చాలా అవసరం. దీని కోసం వర్షపు నీరు నేలలో ఇంకేలా వాలుకు అడ్డంగా కాలువలు, కందకాలు తీసి నీరు వృథాగా పోకుండా చూడాలి. నీటి గుంటలు, చెక్‌డ్యామ్స్, ఫామ్‌పాండ్స్ ఏర్పాటు చేసి భూగర్భజలాలను పెంచవచ్చు. బీడు భూముల్లో చెట్ల పెంపకం, సామాజిక అడవుల పెంపకం చేపట్టాలి. దీని వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు నేలకోత తగ్గి భూసారం పెరుగుతుంది.
News December 28, 2025
CCMBలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

హైదరాబాద్‌లోని <


