News April 9, 2025
కేజీహెచ్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కేజీహెచ్‌లో విశాఖ కలెక్టర్ హరేంద్రప్రసాద్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు వార్డులను సందర్శించారు. అనంతరం ఓపీ గేటు వద్ద రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రోగులకు, సహాయకులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూపరింటెండెంట్ శివానంద్‌ను ఆదేశించారు.
Similar News
News April 19, 2025
విశాఖ మేయర్ పీఠం.. పార్టీల బలాబలాలు

మరికొద్ది గంటల్లో విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడనుంది. 2021లో జరిగిన GVMC ఎన్నికల్లో YCP 58 స్థానాలు నెగ్గి మేయర్ పీఠం కైవశం చేసుకుంది. TDP-30, JSP-3, CPM, CPI ఒక్కో స్థానం గెలిచాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమీకరణాలు మారాయి. దీంతో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కూటమికి సుమారు 64 మంది, YCPకి 30 మంది కార్పొరేటర్‌లున్నారు. ఈ ఓటింగ్‌కు కమ్యూనిస్ట్ పార్టీలు దూరంగా ఉంటున్నాయి.
News April 19, 2025
ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

సబ్బవరం మండలం గణపతి నగర్‌లో డిగ్రీ చదువుతున్న విద్యార్థి కె.అప్పలనాయుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి ఇంటికి వచ్చి గదిలోకి వెళ్లాడు. గంట తర్వాత స్నేహితుడు సుబ్రహ్మణ్యంకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. స్నేహితుడు గణపతి నగర్‌కు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. తల్లి లీలా కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
News April 19, 2025
మలేషియా నుంచి విశాఖ రాని కూటమి మద్దత్తు కార్పొరేటర్

కూటమి కార్పొరేటర్లు విహార యాత్ర నుంచి శుక్రవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. వీరిలో 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత వారితో కలిసి రాలేదు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తనను మాత్రమే పార్టీలో ఆహ్వానించారని, తన భర్తను ఆహ్వానించలేదని అలిగి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పల్లా ఆమెతో ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించి శనివారం విశాఖ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సుజాత వైసీపీలో గెలిచి కూటమిలో చేరారు.