News April 9, 2025
పిట్లం: Way2News ఎఫెక్ట్..’వన్యప్రాణుల దప్పిక తీరింది’

ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పిట్లం అటవీ ప్రాంతంలో నీటి కొరత కారణంగా అడవిలోని మూగజీవాలు దాహంతో అల్లాడుతున్నాయి. దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన సాసర్ పిట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ నెల 7న <<16018843>>’వన్య ప్రాణుల గొంతెండుతోంది’ <<>>అనే శీర్షికతో Way2Newsలో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికుమార్ బుధవారం సాసర్ పిట్లలలో నీటి ట్యాంకర్ సహాయంతో నీటిని నింపారు.
Similar News
News January 10, 2026
‘గోవిందా!’ అని అందామా?

గోవింద నామమంటే శ్రీవారికి ఎంతో ఇష్టం. ‘గో’ అంటే గోవులే కాదు! వేదాలు, కిరణాలు, సమస్త జీవులని అర్థం. జీవులందరినీ జ్ఞానంతో, ఆహారంతో పోషించేవాడే గోవిందుడు. ఓసారి అగస్త్యుడు ఆవును తీసుకోమని ‘గో ఇంద’ (ఆవును తీసుకో) అని స్వామిని పిలవగా ఆ పిలుపే ‘గోవింద’ నామంగా మారిందని పురాణ గాథ. భక్తితో ఒక్కసారి గోవిందా అని పిలిస్తే, ఆయన ఏడుకొండలు దిగి వచ్చి మనల్ని ఆదుకుంటాడు. గోవింద నామ స్మరణ మోక్షానికి సులభ మార్గం.
News January 10, 2026
శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్

మకరజ్యోతి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు శబరిమలకు వచ్చే అవకాశం ఉండటంతో కేరళ పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జనవరి 12 నుంచి పంబాలో వాహనాల పార్కింగ్‌కు అనుమతి లేదని తెలిపారు. ఇక జనవరి 14న ఉదయం 9 గంటల తర్వాత నీలక్కల్ నుంచి పంబాకు, అదే రోజున ఉదయం 10 గంటల నుంచి పంబా-సన్నిధానం వరకు ఎటువంటి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అయ్యప్ప భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News January 10, 2026
ఒర్ణబ్ తుఫాన్ హెచ్చరిక

ఈ నెల 10 నుంచి ఒర్ణబ్ తుఫాన్ ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. మార్కెట్ యార్డుకు సరుకులు తీసుకొచ్చే రైతులు పంట ఉత్పత్తులు తడవకుండా టార్పాలిన్లు కప్పుకుని రావాలని సూచించారు. యార్డులోకి వచ్చిన సరుకును షెడ్లలో లేదా షాపుల ముందు భాగంలో భద్రంగా ఉంచుకోవాలన్నారు.


