News April 9, 2025
ఇంటర్ ప్రవేశాలు ఎలా?

TG: 2025-26 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో ఇంటర్ ప్రవేశాలు ఎలా చేపడతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నా, కాలేజీలకు గ్రేడింగ్ ఇవ్వడం, ఫీజులు నిర్ణయించడం వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వమే ఫీజులు నిర్ణయిస్తే, కాలేజీలు కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. దీంతో పాత విధానంలోనే ముందుకెళ్తారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
Similar News
News September 14, 2025
పాక్‌తో మ్యాచ్‌కు BCCI దూరం!

భారత్, పాక్ మ్యాచ్‌కు BCCI అధికారులు దూరం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. BCCI సెక్రటరీ సైకియా, IPL ఛైర్మన్ ధుమాల్, ట్రెజరర్ ప్రభ్‌తేజ్, జాయింట్ సెక్రటరీ రోహన్ దుబాయ్ వెళ్లేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం. అటు ICC ఛైర్మన్ జైషా USలో ఉన్నారు. ACC ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్న BCCI సెక్రటరీ శుక్లా మాత్రమే మ్యాచ్ వీక్షించే అవకాశముంది. ఫ్యాన్స్ టార్గెట్ చేస్తారనే కెెమెరా ముందుకు రావట్లేదని తెలుస్తోంది.
News September 14, 2025
దేవాన్ష్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు: లోకేశ్

AP: తన కుమారుడు దేవాన్ష్ ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్నాడని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించాడని పేర్కొన్నారు. లండన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తాను పాల్గొన్నానని చెప్పారు. దేవాన్ష్ ముందు చూపు, ఆలోచనా శక్తి, ఒత్తిడిలో ప్రదర్శించిన సమయస్ఫూర్తి వల్లే ఈ విజయం సాధ్యమైందని లోకేశ్ వివరించారు.
News September 14, 2025
పెళ్లైనా తగ్గేదేలే అంటున్న స్టార్ హీరోయిన్స్

పెళ్లైనా, తల్లిగా ప్రమోషన్ పొందినా కొందరు హీరోయిన్లు వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇటీవల విడుదలైన ‘మిరాయ్’ మూవీలో శ్రియ శరణ్ మెరిశారు. ది ఇండియా స్టోరీ, ఇండియన్ 3 మూవీలతో కాజల్ అగర్వాల్ బిజీగా ఉన్నారు. మన శంకరవరప్రసాద్ గారు మూవీతో నయనతార మెరవనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇండియన్ 3, కీర్తి సురేశ్ రివాల్వర్ రీటా, లావణ్య త్రిపాఠి టన్నెల్, సతీ లీలావతి సినిమాలతో కంటిన్యూ అవుతున్నారు.