News April 9, 2025

సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు

image

సలేశ్వరం జాతరకు అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ప్రసాద్ తెలిపారు. అచ్చంపేట నుంచి మొదటి బస్సు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుందని చివరి బస్సు సాయంత్రం 4 గంటలకు ఉంటుందని తెలిపారు. జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా సకాలంలో బస్సులు నడుపుతామని డీఎం తెలిపారు.

Similar News

News April 19, 2025

మేలో మరో ప్రయోగం చేపట్టనున్న ఇస్రో

image

మే నెల 22వ తేదీన ‘GSLV F-16’ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తుంది. ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన నిషార్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండవ ప్రయోగ వేదిక వద్దనున్న వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధాన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2025

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

image

పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఓదెల 41.5℃ నమోదు కాగా అంతర్గం 41.3, సుల్తానాబాద్ 40.7, పాలకుర్తి 40.6, పెద్దపల్లి 40.6, రామగుండం 40.1, ఎలిగేడు 40.0, జూలపల్లి 39.7, కమాన్పూర్ 39.6, రామగిరి 39.5, మంథని 39.3, ధర్మారం 39.3, కాల్వ శ్రీరాంపూర్ 39.2, ముత్తారం 39.8℃ గా నమోదయ్యాయి.

News April 19, 2025

‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

image

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా నిన్న థియేటర్లలో రిలీజవగా మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.15 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఎమోషనల్ బ్లాక్ బస్టర్’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.

error: Content is protected !!