News April 9, 2025
జీవన ప్రమాణాలు పెంచడమే నిజమైన అభివృద్ధి: సీతక్క

సమాజంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే నిజమైన అభివృద్ధి అని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మూడు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన సామాజిక అభివృద్ధి సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న పలు మహిళా శిశు సంక్షేమ, సామాజిక కార్యక్రమాలను సదస్సులో సీతక్క వివరించారు.
Similar News
News November 14, 2025
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నేటి నుంచి సీఐఐ సదస్సు

AP: రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వైజాగ్‌లో CII భాగస్వామ్య సదస్సు ఇవాళ, రేపు జరగనుంది. దీని కోసం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ CM చంద్రబాబు పలు దేశాల్లో పర్యటించారు. ‘ఇన్వెస్ట్ ఇన్ AP’ సందేశంతో, ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్-2047’ థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తోంది.
News November 14, 2025
ఇటిక్యాల: బాలిక కిడ్నాప్ కేసు.. 35 ఏళ్లు జైలు

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, రేప్ చేసిన కేసులో ఇటిక్యాల మండలం గార్లపాడుకు చెందిన చాకలి హరిచంద్రకు 35 ఏళ్లు జైలు శిక్ష, రూ. 50 వేలు జరిమానా విధిస్తూ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి రవికుమార్ గురువారం గద్వాలలో తీర్పునిచ్చారు. నేరస్థుడిపై కోదండపూర్ పిఎస్‌లో 22-7-2017 కేసు నమోదైంది. విచారణ చేపట్టిన కోర్టు లైసెన్స్ అధికారులు సాయిబాబ, జిక్కి బాబు అతడికి శిక్ష పడే విధంగా కృషి చేశారు.
News November 14, 2025
లైంగిక దాడి నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష

హిందూపురం యువకుడు వెంకటరమణకు 25ఏళ్ల జైలు శిక్ష పడిందని తెలంగాణలోని గద్వాల SP శ్రీనివాసరావు తెలిపారు. 2024లో వడ్డేపల్లి మండలంలోని మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పారు. దీనిపై శాంతినగర్ పీఎస్‌లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం గద్వాల ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి రవికుమార్ నిందితుడికి 25ఏళ్ల జైలు శిక్ష, రూ.40వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించారని చెప్పారు.


