News April 9, 2025

నరసరావుపేట: వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

పల్నాడు జిల్లాలో ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ అరుణ్ బాబు గోడ పత్రికలు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. డీఈఓ చంద్రకళ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 12, 2026

SKLM: విద్యుత్ సమస్యలపై ఈ నెల 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

image

రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలపై AP విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి27వరకు ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం SE నాగిరెడ్డి కృష్ణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విచారణలు హైబ్రిడ్ విధానంలో యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందన్నారు. టెక్కలి పలాస డివిజన్ కార్యాలయాల నుంచి పాల్గొనవచ్చన్నారు.

News January 12, 2026

నాణ్యతలో రాజీ పడొద్దు.. విద్యార్థుల కిట్‌పై రేవంత్

image

TG: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువుల కిట్‌కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని CM రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ‘వేసవి సెలవుల తర్వాత బడులు ప్రారంభమయ్యే నాటికి కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దు. యూనిఫామ్, బెల్ట్, టై, షూస్, బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర వస్తువులను అందించేందుకు ప్రొక్యూర్మెంట్ ప్లాన్లు సిద్ధం చేయాలి’ అని ఆదేశించారు.

News January 12, 2026

రబీ సీజన్‌కు సరిపడా యూరియా ఉంది: వ్యవసాయాధికారి

image

రబీ 2025–26 సీజన్‌కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ కుమారి తెలిపారు. జిల్లాకు అవసరమైన 38,353 మెట్రిక్ టన్నుల యూరియాకు ప్రణాళిక రూపొందించగా, ఇప్పటివరకు 25,504 మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేసామని. అక్టోబర్ 1, 2025 నుంచి జనవరి 11, 2026 వరకు 21,734 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగినట్లు తెలిపారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.