News April 9, 2025
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో జైలులో ఉన్న ఆయనతో పాటు మరో 9 మంది రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియడంతో అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలన్న పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమేరకు ఆదేశాలిచ్చింది.
Similar News
News November 2, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలోనూ చికెన్ ధరలు తగ్గట్లేదు. హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.210-250, కామారెడ్డిలో రూ.260, ఉమ్మడి ఖమ్మంలో రూ.210-240, విజయవాడలో రూ.250, ఏలూరులో రూ.220, విశాఖలో రూ.260గా ఉన్నాయి. కార్తీక మాసం అయినప్పటికీ ఆదివారం కావడంతో పలు ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. మీ ఏరియాలో రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.
News November 2, 2025
ఎగిరే కారు తెస్తున్నా: ఎలాన్ మస్క్

అసాధ్యాలను సాధ్యం చేసే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. తమ కంపెనీ నుంచి గాల్లో ఎగిరే కారును తెస్తున్నట్లు ఓ పాడ్‌కాస్ట్‌లో వివరించారు. ఈ ఏడాదిలోనే దానికి సంబంధించిన ప్రొటో టైప్‌ను ప్రదర్శిస్తామన్నారు. అయితే ఆ కారుకు రెక్కలుంటాయా? హెలికాప్టర్‌లా ఎగురుతుందా? అనే పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. తమ ఆవిష్కరణ ఊహలకు అందని విధంగా ఉంటుందని మాత్రం మస్క్ స్పష్టం చేశారు.
News November 2, 2025
వరిలో రెల్లరాల్చు పురుగును ఎలా నివారించాలి?

వరి పంటను రెల్లరాల్చు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు లార్వాలు గింజ గట్టిపడే దశలో కంకులను కత్తిరిస్తాయి. దీని వల్ల కంకులు రాలిపోతాయి. ఈ పురుగులు పగలు భూమిలో దాక్కొని రాత్రి వేళల్లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఈ పురుగుల ఉద్ధృతి తక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ.. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరంట్రనిలిప్రోల్ 0.3ml కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.


