News April 9, 2025

తెలంగాణ పేరును కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారు: హరీశ్ రావు

image

తెలంగాణ పేరును 10ఏళ్ల పాలనలో కేసీఆర్ దేశవ్యాప్తంగా నిలబెడితే సంవత్సర పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పడగొట్టారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. బుధవారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని పాలించడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు. కేసీఆర్ మొక్కలు నాటితే ఇప్పుడు పెరిగిన చెట్లను రేవంత్ రెడ్డి కొట్టేస్తున్నారన్నారు.

Similar News

News March 3, 2026

VZM: బర్త్‌డే.. డెత్‌ డే

image

ఆరిలోవ హెల్త్ సిటీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు విజయనగరం (D) గజపతినగరం (M) రామన్నపేటకు చెందిన సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు. సాయికిరణ్ ఉషోదయ జంక్షన్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం తన పుట్టినరోజు కావడంతో బైక్‌పై సింహాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు SI ధర్మేందర్ తెలిపారు.

News March 3, 2026

ఖమ్మం: వెలుగుమట్ల ఘటనపై కేరళ CM ఫైర్

image

ఖమ్మం నగరం వెలుగుమట్లలో భూదాన్ భుముల్లో ఇళ్ల కూల్చివేతలు ‘బుల్డోజర్ రాజ్యం’ను తలపిస్తున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. ముందస్తు నోటీసులు లేకుండా వందల కుటుంబాలను నిరాశ్రయులుగా మార్చడం దారుణమన్నారు. పోలీసుల సమక్షంలో పత్రాలు ఉన్న ఇళ్లను కూడా కూల్చివేశారని, సుమారు 3 వేల మంది ప్రభావితులయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి చర్యలు ఆందోళనకరమని పేర్కొన్నారు.

News March 3, 2026

రాజమండ్రి కల్తీ పాలు ఘటన.. మరొకరి మృతి

image

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారిలో సోమవారం రాత్రి మరొకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, గాంధీ పురం ప్రాంతాలకు చెందిన 20 మంది గత నెల 16 నుంచి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇప్పటికే ఐదుగురు మరణించగా, తాజాగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.