News April 9, 2025
పంట నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దు: ఎమ్మెల్యే

పంట నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు. నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లిలో ఎమ్మెల్యే నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అకాల వర్షంతో వరి, మామిడి, మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లిందని, తక్షణమే అంచనా వేయాలని అధికారులు ఆదేశించారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
ఏలూరు: రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి

ఏలూరులో గురువారం గుర్తు తెలియని వ్యక్తి ఈస్ట్ కోస్ట్ రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ మాస్టర్ సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగి, స్కై బ్లూ చొక్కా, బ్లూ ప్యాంట్ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసినవారు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని రైల్వే హెచ్‌సీ శ్రీనివాసరావు కోరారు.
News November 6, 2025
వేములవాడ: ‘బాధ్యతతో మెదులుదాం.. కుటుంబాలకు అండగా నిలుద్దాం’

విధి నిర్వహణ సందర్భంగా బాధ్యతతో వ్యవహరించి కుటుంబాలకు అండగా నిలుద్దామని వేములవాడ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. వేములవాడ పరిధిలోని వ్యాన్ డ్రైవర్లకు అవగాహన శిబిరం నిర్వహించారు. జాగ్రత్తగా వాహనాలను నడిపి వాహనాలతోపాటు తాము కూడా క్షేమంగా ఇంటికి చేరే విధంగా మసులుకుంటామని ఈ సందర్భంగా వారితో ప్రతిజ్ఞ చేయించారు. వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News November 6, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: WINES బంద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం(09-11-2025) సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం(11-11-2025) సాయంత్రం 6 గంటల ముగిసేవరకు వైన్స్, పబ్బులు, రెస్టారెంట్లు బంద్ చేయాలని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 14 కౌంటింగ్ రోజు కూడా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.


