News April 9, 2025
ములుగు కలెక్టర్ పనితీరు అద్భుతం

ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర పనితీరు అద్భుతంగా ఉందని ములుగు జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు వంగ రవి యాదవ్ అన్నారు. బుధవారం కలెక్టర్ దివాకర జన్మదిన పురస్కరించుకొని కలెక్టరేట్ కార్యాలయంలో రవి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ములుగు జిల్లా అధికార ప్రతినిధి ఎండి అహ్మద్ భాషా, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Similar News
News July 7, 2025
విశాఖ చేరుకున్న మంత్రి పార్థసారధి

ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన నిమ్మితం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సోమవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సమాచార శాఖ అధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి మంత్రి రోడ్డు మార్గాన్న బయలుదేరి నగరంలోకి వెళ్లారు.
News July 7, 2025
వర్ధన్నపేట వైపే స్వర్ణ చూపు..!

వర్ధన్నపేట నియోజకవర్గం పదేళ్ల పాటు బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉంది. కానీ వినూత్న పరిణామాల వల్ల ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఈ స్థానం జనరల్‌గా మారుతుందనే ఊహాగానాలతో వరంగల్ నగర మాజీ మేయర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ చూపు తన తన సొంత నియోజకవర్గ కేంద్రంపై పడిందనే చర్చ జరుగుతోంది.
News July 7, 2025
HYD: హైరైజ్ కెమెరాలతో 360 డిగ్రీల పర్యవేక్షణ

HYD నగర ప్రధాన మార్గాల్లో 21 ప్రాంతాల్లో ఎత్తయిన భవనాలపై హైరైజ్ కెమెరాలను అధికారులను ఏర్పాటు చేశారు. 360 డిగ్రీల కోణంలో 3.4 కిలోమీటర్ల దూరం వరకు రహదారులపై ఉన్న పరిస్థితులను దీని ద్వారా గుర్తించవచ్చు. అక్కడి పరిస్థితులపై గూగుల్‌కు సైతం సమాచారం అందనుంది. HYD కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలు పోలీసు అధికారులు కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు.