News April 9, 2025

బాసర RGUKTలో 41 మంది కాంట్రాక్టు అధ్యాపకుల రాజీనామా

image

ప్రభుత్వ GO21పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆర్జీయూకేటీ బాసరలో విధులు నిర్వహిస్తున్న 41మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదనపు బాధ్యతలను చేయలేమంటూ ఆ బాధ్యతలకు మూకుమ్మడి రాజీనామా లేఖను ఏవో రణధీర్‌కు అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా టీచింగ్‌‌, పరిపాలన బాధ్యతలతో పాటు విశ్వవిద్యాలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఊరుకోమన్నారు.

Similar News

News February 26, 2026

HYD: మూసీ సుందరీకరణ.. నిధుల కోసం ఢిల్లీ బాట!

image

మూసీ పునరుజ్జీవనంపై సర్కారు పట్టుదలతో ఉన్నా, నిధుల వేట సవాలుగా మారింది. రూ.17 వేల కోట్ల మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర బడ్జెట్‌లో ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగేలా కనిపిస్తోంది. సర్వేలు పూర్తయినా, భూసేకరణ, పునరావాసంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావడంతో నిధుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

NLG: మెడికల్ కాలేజీ అభివృద్ధికి రూ.85 కోట్లు: మంత్రి కోమటిరెడ్డి

image

ప్రభుత్వ మెడికల్ కళాశాల వార్షికోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఆగిపోయిన పనులను రూ.85 కోట్లతో పూర్తి చేసి కళాశాలను ఆదర్శంగా తీర్చిదిద్దామని తెలిపారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, కాబోయే డాక్టర్లు మానవత్వంతో పేదలకు సేవలందించాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.