News April 9, 2025
పెద్దపల్లి: విద్యుత్తు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండండి: SE

పెద్దపల్లి సర్కిల్ విద్యుత్ శాఖ SE మాధవ రావు వర్షాకాలంలో సంభవించే ప్రమాదాలు అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. విద్యుత్ స్తంభాలకు తీగలు కట్టి బట్టలు ఆరవేయద్దన్నారు. తడిసిన స్తంభాలు, సపోర్ట్, స్టే వైర్ తాకకూడదు. వ్యవసాయ బావులు, గృహోపకరణాలు తదితర అవసరాలకు అతుకులు లేని వైర్లను వాడాలి. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సిబ్బందిని లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912ని సంప్రదించాలన్నారు.
Similar News
News October 20, 2025
జనగామ: బడుల పర్యవేక్షణకు కమిటీలు

ప్రభుత్వ బడుల్లోని విద్యా వ్యవస్థను పర్యవేక్షించేందుకు విద్యాశాఖ సంచాలకుడు నికోలస్ ఉపాధ్యాయులతో బడుల పర్యవేక్షణకు కమిటీల ఏర్పాటు ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఈ కమిటీలపై జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయులపై ఇప్పటికే అదనపు భారాలతో ఇబ్బందులు పడుతుంటే కమిటీల వల్ల ఇబ్బందులు పెరుగుతాయని సంఘాల బాధ్యులు అంటున్నారు.
News October 20, 2025
జనగామ: 154 ఆర్టీఐ దరఖాస్తులకు పరిష్కారం

ఇటీవల జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)లో దరఖాస్తులను పరిష్కరించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డుగా అందుకున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర స్థాయిలో పెండింగ్‌లో ఉన్న 174 అప్పీళ్లను 154 పరిష్కరించి రాష్ట్ర స్థాయిలో పరిష్కారాల్లో జిల్లా తృతీయ స్థానంలో నిలిచింది. ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్ లేకుండా ప్రతివారం రివ్యూ చేస్తున్నారు.
News October 20, 2025
VJA: దీపావళి టపాసులను వదలని రాజకీయం..!

విజయవాడలో దీపావళి సందడి మొదలైంది. అయితే.. టపాసులపై కూడా రాజకీయ పార్టీల గుర్తులను ముద్రించి విక్రయించడం విశేషంగా నిలిచింది. నగరంలోని దుకాణాల్లో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ‘షాట్స్’ అందుబాటులో ఉంచారు. వీటిని వినియోగదారులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారని దుకాణ నిర్వాహకులు చెబుతున్నారు.