News April 9, 2025
దిశా కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ

ఒంగోలులో ప్రకాశం భవన్‌లో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిశా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కమిటీ సమావేశానికి ఛైర్మన్‌గా ఎంపీ మాగుంట వ్యవహరించారు. దిశా కమిటీని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి ముందుకు నడిపించాలని ఆయన అన్నారు.
Similar News
News April 19, 2025
సంతనూతలపాడు MLA టికెట్ పేరుతో మోసం

ఎమ్మెల్యే టికెట్ పేరుతో ప్రకాశం జిల్లాలో మోసం జరిగింది. తనకు కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ అదే పార్టీకి చెందిన నాగలక్ష్మి, ఆమె భర్త సతీశ్ రూ.10 లక్షలు తీసుకున్నారని సుబ్బారావు ఆరోపించారు. నగదు తీసుకుని తనను మోసం చేశారని ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.
News April 19, 2025
ప్రకాశం: వీరిద్దరే దొంగలు.. జాగ్రత్త

ఇటీవల ప్రకాశం జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాళ్లూరు పోలీసులు శుక్రవారం ఇద్దరు దొంగల ఫోటోలను రిలీజ్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా వీళ్లు దొంగతనాలు చేస్తున్నారు. అనాథాశ్రమానికి సహాయం చేయండంటూ ముందుగా మహిళ తాళాలు వేసిన ఇళ్లను గమనిస్తుంది. ఆ తర్వాత మరో వ్యక్తికి సమాచారం అందిస్తే అతను దొంగతనం చేస్తాడు. వీరితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
News April 18, 2025
క్రికెట్ బెట్టింగ్ కేసులో సింగరాయకొండ వాసి అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సింగరాయకొండకు చెందిన వైసీపీ నేత వెంకట్రావు గురువారం అరెస్టయ్యారు. బెట్టింగ్‌లో ఓడిపోయిన కడప వాసి సతీశ్ కుమార్ వెంకట్రావుకు రూ. 2 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ నగదు కోసం వేధిస్తున్నాడని సతీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించి నెల్లూరు జైలుకు తరలించారు.