News April 9, 2025
మహావీర్ జయంతి: రేపు ఐచ్ఛిక సెలవు

రేపు మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ (ఐచ్ఛిక) హాలిడే ప్రకటించింది. అలాగే స్టాక్ మార్కెట్లకు సైతం హాలిడే ఉండనుంది. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సైతం సెలవు ప్రకటించారు (ఏపీ, తెలంగాణలో లేదు). 24వ తీర్థంకరుడైన భగవాన్ మహావీర్ జన్మదినాన్ని మహావీర్ జయంతిగా జరుపుకుంటారు. ఈయన జైన మత విస్తరణకు విశేష కృషి చేశారు.
Similar News
News January 16, 2026
ADB రిమ్స్‌లో పోస్టులకు దరఖాస్తులు

ADB రిమ్స్ వైద్య కళాశాలలో వివిధ విభాగంలో డాక్టర్ పోస్టులను గౌరవ వేతనంతో పాటు కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. అర్హులైన ట్యూటర్స్, సీఎంఓ, సివిల్ అసిస్టెంట్ సర్జన్, సీనియర్ రెసిడెంట్స్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వివరాలకు rimsadilabad.org, adilabad.telangana.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలన్నారు. ఈ నెల 23న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.
News January 16, 2026
ప్రజల నమ్మకానికి నిదర్శనం.. ముంబై రిజల్ట్స్‌పై అమిత్ షా

దేశం దృష్టిని ఆకర్షించిన BMC ఎన్నికల్లో BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారైంది. 227 వార్డులకుగానూ 129 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 72 స్థానాలతో ఠాక్రే సోదరుల కూటమి తర్వాతి స్థానంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 15 సీట్లలోనే ప్రభావం చూపుతోంది. NDA ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, విధానాలపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
News January 16, 2026
ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్

AP: రాష్ట్రానికి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ‘AM గ్రీన్’ కంపెనీ కాకినాడలో 1.5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎక్స్‌పోర్ట్ టర్మినల్ ఏర్పాటు చేయబోతుందని, దీనివల్ల 8వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని ట్వీట్ చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన అమ్మోనియాను జపాన్, జర్మనీ, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారని పేర్కొన్నారు.


