News March 27, 2024

SBI డెబిట్ కార్డుల ఛార్జీలు పెంపు

image

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన SBI.. డెబిట్ కార్డు మెయింటనెన్స్ ఛార్జీలను పెంచింది. వివిధ రకాల కార్డులపై ఏడాదికి రూ.75 మేర ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులపై ఏడాదికి రూ.125 ఛార్జి చేస్తుండగా, APR 1 నుంచి రూ.200 కానుంది. యువ, గోల్డ్, కాంబో, ప్లాటినం, ప్రైడ్, ప్రీమియం బిజినెస్ కార్డుల ఛార్జీలూ పెరిగాయి.

Similar News

News April 10, 2026

ఆర్టీసీలో ట్రైనీ ఫలితాలు విడుదల

image

TGSRTCలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ(TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ(MST) పోస్టుల ఫలితాలను TSLPRB రిలీజ్ చేసింది. TST పోస్టులకు 9,377 మంది, MST జాబ్స్‌కు 2,755మంది అర్హత సాధించినట్లు తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో 1:5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు HYD అంబర్‌పేట్ PTCలో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించింది. 198 పోస్టుల భర్తీకి మార్చి 29న పరీక్షలు జరిగాయి.

News April 10, 2026

RCB Vs RR.. టాస్ ఆలస్యం

image

అస్సాంలోని గువాహటిలో జరగాల్సిన RCB-RR మ్యాచ్ టాస్ ఆలస్యంగా పడనుంది. స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. వాన తగ్గాక అంపైర్లు పిచ్‌ను పరిశీలించి టాస్‌పై ప్రకటన చేస్తారు. ఈ నెల 7న రాజస్థాన్-ముంబై మ్యాచ్ సందర్భంగానూ గువాహటిలో భారీ వర్షం కురవడంతో గేమ్‌ను 11 ఓవర్లకు కుదించారు. దీంతో అస్సాంలో మ్యాచులంటే ‘అస్సామే’ అని IPL ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.

News April 10, 2026

మావిగన్‌తో మరుసటి రోజే రాజధాని: సజ్జల

image

AP: చంద్రబాబు లెక్క ప్రకారం అమరావతి పూర్తి కావాలంటే రూ.2-3 లక్షల కోట్లు కావాలని, అందుకు 30-40 ఏళ్లు పడుతుందని YCP రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కానీ జగన్ సూచించిన మావిగన్‌లో 10% ఖర్చుతో మరుసటి రోజే రాజధాని అవుతుందని చెప్పారు. మావిగన్ ప్రాంతం ఇప్పటికే ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లతో ప్రపంచానికి అనుసంధానమై ఉందని, త్వరలోనే పోర్టు కూడా వస్తుందని తెలిపారు.