News April 9, 2025
YS జగన్‌పై కేంద్రానికి టీడీపీ ఎంపీ ఫిర్యాదు

AP: మాజీ సీఎం జగన్ తీరు ప్రజాస్వామ్యానికి హానికరంగా మారిందని TDP MP లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ‘జగన్ ప్రసంగాలు శాంతి భద్రతలకు ముప్పు కలిగించేలా ఉన్నాయి. పర్యటనల పేరిట విధ్వంసాలు సృష్టించాలని చూస్తున్నారు. పోలీసుల నైతికతను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. బెయిల్‌పై ఉన్న ఆయన వ్యవస్థలను బెదిరించేలా వ్యవహరించడం బెయిల్ షరతులను ఉల్లంఘించడమే’ అని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News April 19, 2025
‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా నిన్న థియేటర్లలో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.15 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఎమోషనల్ బ్లాక్ బస్టర్’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.
News April 19, 2025
18 సీజన్లలో 22 సార్లు మాత్రమే హ్యాట్రిక్ నమోదు!

నిన్నటితో IPL టోర్నీ ప్రారంభమై 18 ఏళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ 18 సీజన్లలో మొత్తం 755 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. ఇప్పటివరకూ 1,130 మ్యాచులు జరగ్గా 104 సెంచరీలు, 1,754 అర్ధ సెంచరీలతో 3,59,361 రన్స్ నమోదయ్యాయి. అలాగే 1,366 డక్స్, 30,825 ఫోర్లు, 13,605 సిక్సులు, 349 మెయిడిన్స్, 13,313 వికెట్లు, 8,519 క్యాచులు, 37 ఫైఫర్స్, 15 సూపర్ ఓవర్లు, 22 సార్లు హ్యాట్రిక్ నమోదవడం విశేషం.
News April 19, 2025
ప్రాజెక్ట్ చీతా: భారత్‌కు మరో 8 చిరుతలు

ప్రాజెక్ట్ చీతాలో భాగంగా భారత్ మరో 8 చిరుతలను సౌథర్న్ ఆఫ్రికా దేశాల నుంచి తీసుకురానుంది. తొలి దశలో బోత్స్వానా నుంచి వచ్చే నెలలో నాలుగు చిరుతలు వస్తాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) అధికారులు తెలిపారు. 2022లో నమీబియా నుంచి 8, 2023లో SA నుంచి 12 చిరుతల్ని తీసుకువచ్చారు. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్‌లో(MP) మొత్తం 26 చిరుతలు ఉన్నాయి.