News April 9, 2025
ఫేస్‌బుక్, మెసెంజర్‌లోనూ టీన్ అకౌంట్స్!

టీనేజర్ల భద్రత కోసం Instagramలో టీన్ అకౌంట్స్ ఫీచర్‌ను తీసుకొచ్చిన Meta, ఇప్పుడు దీనిని ఫేస్‌బుక్, మెసెంజర్‌కూ విస్తరించనుంది. తొలుత ఇది USA, UK, ఆస్ట్రేలియా, కెనడాలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ వల్ల 13-18 ఏళ్ల వయసున్న వారి ఖాతాలు తల్లిదండ్రుల నియంత్రణలో ఉంటాయి. తాజాగా టీన్ ఖాతాలకు ఇన్‌స్టా లైవ్ వీడియోస్ చూడటం/చేయడాన్ని నిషేధించింది. అలాగే న్యూడ్ కంటెంట్‌ను ఫిల్టర్ చేస్తోంది.
Similar News
News September 14, 2025
6 పరుగులకే 2 వికెట్లు

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. హార్దిక్ పాండ్య తొలి బంతికే వికెట్ తీశారు. ఓపెనర్ అయుబ్(0) ఇచ్చిన క్యాచ్‌ను బుమ్రా ఒడిసి పట్టారు. బుమ్రా వేసిన రెండో ఓవర్ రెండో బంతికి హారిస్ (3) పాండ్యకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్ స్కోర్ 6/2.
News September 14, 2025
BREAKING: భారత్ ఓటమి

హాకీ ఆసియా కప్ ఫైనల్లో చైనా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. తుది పోరులో 4-1 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. దీంతో వరల్డ్‌కప్ ఆశలు ఆవిరయ్యాయి. తొలి నిమిషంలో నవనీత్ గోల్ కొట్టినా ఆ తర్వాత అమ్మాయిలు నెమ్మదించారు. అటు వరుస విరామాల్లో చైనా ప్లేయర్లు గోల్స్ కొట్టడంతో ఆసియా కప్-2025 విజేతగా నిలిచారు. చైనాకు ఇది మూడో టైటిల్.
News September 14, 2025
రూ.153 కోట్లతో USలో ఇల్లు కొన్న అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అమెరికాలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది. న్యూయార్క్‌లోని ఈ ఇంటి విలువ $17.4 మిలియన్లు (రూ.153 కోట్లు) అని పేర్కొంది. గత పదేళ్లుగా అది ఖాళీగా ఉందని తెలిపింది. 2018లో రాబర్ట్ పేరా $20 మిలియన్లకు దీన్ని కొనుగోలు చేశారు. 20వేల స్క్వేర్ ఫీట్ల ఈ భారీ భవంతిలో 7 బెడ్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్, 5వేల స్క్వేర్ ఫీట్ల ఔట్ డోర్ స్పేస్ ఉన్నాయి.